మావోయిస్టులతో చర్చలు లేవు

4A
తలుపులేసిన హోం మంత్రి రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 27 (జనంసాక్షి) :

మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మావోయిస్టులతో చర్చలు జరుపుతారా అనే చర్చ సాగుతోన్న సమయంలో రాజ్‌నాథ్‌ అలాంటివేమీ ఉండబోవంటూ తలుపులేసేశారు. అయితే మావోయిస్టుల సమస్య పరిష్కారానికి సమన్వయంతో కృషిచేస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలతో కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం సమావేశమయ్యారు. పలు అంశాలను వీరు చర్చించారు. ప్రధానంగా శాంతిభద్రతల అంశంపై రాజ్‌నాథ్‌ పలు సూచనలు చేశారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీలతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. నక్సల్స్‌పై ముందుగా దాడి హేయమని.. వాళ్లు దాడి చేస్తే అణచి వేస్తమన్నారు. నక్సల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మ  మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు పాల్గొన్నారు.