కళాశాల భవనంపైనుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ : ఖమ్మంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక నవీన జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రమ్య అనే విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.