గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

4

కాకతీయ, నిజాం వైభవాన్ని చాటుదాం

తెలంగాణాను సస్యశ్యామలం చేద్దాం

నీరు పారుదల అధికారులతో మంత్రి హరీశ్‌ సమీక్ష

హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) :

తెలంగాణలో గొలుసుకట్టు చెరువులను పునరుద్దరించాలని, అన్ని చెరువులను పరిరక్షిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పునరుద్ఘాటించారు. ఎలాంటి ఆక్రమణలు ఉన్నా సహించబోమన్నారు. జలసౌధలో చిన్న నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించి చిన్న నీటి పారుదలకు పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో చిన్న నీటి పారుదల రంగానికి పెద్ద పీట వేస్తామన్నారు. మైనర్‌ ఇరిగేషన్‌ ద్వారా 20 నుంచి 25 లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. జపాన్‌, కేంద్రం నుంచి వచ్చిన నిధుల ఆధారంగా రెండో ఫేజ్‌ ప్రతిపాదిత పనులు పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తి చేయని కంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతామన్నారు. జైకా తదితర నిధులతో చేపట్టిన అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే చెరువులను రక్షించాలని అన్నారు. ఇందులో ఎలాంటి ఆక్రమణలు ఉన్నా తొలగించాలన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పారు. చిన్న నీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి పరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నాణ్యతతో కూడిన పనులు జరగాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. సెప్టెంబర్‌ 30 లోగా పనులు పూర్తి చేసి థర్డ్‌ ఫేజ్‌కు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతి మూడు నెలలకొక సారి మైనర్‌ ఇరిగేషన్‌పై సవిూక్షా సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. చిన్న నీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేయాలని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్ల కోసం పనులు సృష్టిస్తే వూరుకునేది లేదని హెచ్చరించారు. గతంలో చేసిన తప్పులు పునరావృతమైతే సహించేదిలేదని స్పష్టం చేశారు. నీటిసామర్థ్యం పెంచేలా చిన్న నీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేయాలని నీటిపారుదలశాఖ అధికారులకు మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు. కాంట్రాక్టర్ల కోసం పనులు సృష్టిస్తే ఊరుకునేది లేదు. గతంలో చేసిన తప్పులు పునరావృతమైతే సహించమని పేర్కొన్నారు. అన్ని జిల్లాల చిన్న నీటిపారుదలశాఖ అధికారులతో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. శాఖ పనితీరుపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్త రాష్ట్రంలో రైతులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పురోగతిపై  సమీక్ష నిర్వహించింది. ఈ అంశానికి సంబంధించి తాగునీటి శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌ రావు సమావేశమయ్యారు. ఈ భేటీలో గొలుసుకట్టు చెరువుల పునరుద్దరణ చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. కాగా, ఆక్రమణలకు గురైన చెరువులను కూడా తిరిగి పునరుద్దరణ  కార్యాచరణను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు. పూడికతీత పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దని హరీష్‌ రావు అధికారులకు హరీష్‌ రావు విజ్ఞప్తి చేశారు.  ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటా తేలాల్సి ఉందన్నారు. నదీ జలాల వాటాపై సాధ్యమైనంత త్వరలో పరిష్కారం దొరికే అవకాశం ఉందన్నారు. ఆ తరువాతే ప్రాజెక్టులపై ఆలోచిస్తామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి మైనర్‌ ఇరిగేషన్‌పై సమీక్షా నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. ఈ మూడు నెలల కాలంలో జరిగిన ప్రాజెక్టుల ప్రగతిని పరిశీలిస్తానని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నీటిసామర్థ్యం పెంచేలా చిన్న నీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేయాలని నీటిపారుదలశాఖ అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. కాంట్రాక్టర్ల కోసం పనులు సృష్టిస్తే ఊరుకునేది లేదు. గతంలో చేసిన తప్పులు పునరావృతమైతే సహించమని పేర్కొన్నారు.