ఉసురు తీసిన ఈత

3

డిండి రిజర్వాయర్‌లో మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి

నల్గొండ, జూన్‌ 30 (జనంసాక్షి) :

నల్లగొండ జిల్లాలోని డిండి రిజర్వాయర్‌లో ఈతకెళ్లిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. తాత కర్మకు వెళ్లిన అన్నదమ్ముల పిల్లలైన వీరు సోమవారం ఉదయం డిండి రిజర్వాయర్‌ను చూడటానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. అయితే ఈతకొట్టడానికి వెళ్లిన అందులో దిగారని కొందరు చెబుతున్నారు. దీన్ని గుర్తించిన స్థానికులు రిజర్వాయర్‌లో నుంచి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు హర్షవర్దన్‌రెడ్డి, ప్రణనీత్‌రెడ్డి (అన్నదమ్ములు), దేవయాని, జోత్స్న (అక్కాచెల్లెళ్లు), వరంగల్‌కు చెందిన అవినాష్‌రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనతో డిండి ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరి మృతిపై ఇంట్లో తల్లిదండ్రల రోదనలు మిన్నంటాయి. డిండి రిజర్వాయర్‌ ప్రమాదఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. డిండి రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి ఉదయం ఐదుగురు యువతీయువకులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై డిండి ప్రాజెక్టులో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. విద్యార్థుల మృతి దురదృష్టకరమన్నారు. తక్షణమే డిండి వెళ్లాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించామని పేర్కొన్నారు. వారి నివేదిక అందాక ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హావిూనిచ్చారు.

డిండి మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: నాయిని

డిండి ప్రాజెక్టులో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. విద్యార్థుల మృతి దురదృష్టకరమన్నారు. వారి కుటుంబాలకు సర్కార్‌ అండగా ఉంటుందన్నారు.  తక్షణమే డిండి వెళ్లాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించామని పేర్కొన్నారు. వారి నివేదిక అందాక ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హావిూనిచ్చారు.  బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ డిండి ప్రమాదంలో ఐదుగురు మరణించారని, వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించామని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. నివేదిక వచ్చిన అనంతరం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఈతకు వెళ్లి ఐదుగురు మృత్యవాత పడ్డారు.