చెన్నై భవనం కూలిన ఘటనలో 42కి చేరిన మృతులు

బుధవారం, 2 జులై 2014 (జ‌నంసాక్షి ):

 

చెన్నై నగర శివారు ప్రాంతమైన మొగిలివాక్కంలో 11 బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య బుధవారం 41కి చేరింది. గత అర్థరాత్రి భవన శిథిలాల నుంచి 8 మృత దేహాలను వెలికి తీశారు. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న మరో 27 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 
ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా శనివారం నిర్మాణంలో ఉన్న11 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ భవన నిర్మాణంలో పని చేస్తున్న కార్మికులలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే. వీరంతా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు కావడంతో ఆయా జిల్లాల్లో విషాద చాయలు అలముకున్నాయి.