విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం
శంషాబాద్( జనంసాక్షి): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ఓ ప్రైవేటు సంస్థ మోసం చేసింది. స్విజ్జర్లాండ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 160 మందిని నమ్మించి కోటి రూపాయలకు పైగా వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. స్విట్జర్లాండ్ వెళ్లేందుకు శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వీరంతా తాము మోసపోయిన విషయాన్ని గుర్తంచారు. ప్రైవేటు సంస్థకు చెందిన ప్రవీణ్ అనే ఏజెంట్, యూసూబ్‌లను చితకబాది శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.