8న ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

2

సెంటర్లు మారతాయి:కన్వీనర్‌

హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి):

ఈ నెల 8న ఎంసెట్‌-3 షెడ్యూల్‌ను విడు దల చేస్తామని ఎంసెట్‌-3 కన్వీనర్‌ ప్రొఫె సర్‌ యాదయ్య ప్రకటించారు. ఎంసె ట్‌-3పై జేఎన్టీయూలో సమావేశమైన నిర్వ హణ కమిటీ పలు అంశాలపై చర్చించింది. అనంతరం యాదయ్య విూడియాతో మా ట్లాడుతూ.. రెండు, మూడు రోజుల్లో ఎంసెట్‌-3 వెబ్‌సైట్‌ ఏర్పాటు చేస్తామన్నా రు. 8న షెడ్యూల్‌ విడుదల చేస్తాం.. వచ్చే నెల 3 నుంచి కొత్త హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. హాల్‌ టికెట్‌ నం బర్‌, పరీక్షా కేంద్రాలు మారుతాయని స్పష్టం చేశారు. ఎంసెట్‌-2 రాసిన వారికే ఎంసెట్‌-3 పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నా రు. వచ్చే నెల 11న పరీక్షను నిర్వహిం చనున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. సెప్టెంబరు 11న జరగనున్న తెలంగాణ ఎంసెట్‌-3 పరీక్షకోసం కొత్త హాల్‌టికెట్లు జారీ చేయాలని నిర్వహణ కమిటీ నిర్ణయించింది. ఎంసెట్‌-2 రాసిన వారంతా సెంసెట్‌-3 రాసేందుకు అర్హులేనని, పాత రిజిస్ట్రేషన్ల  సంఖ్య ఆధారంగానే హాల్‌టికెట్లు ఇస్తామని కన్వీనర్‌ యాదయ్య తెలిపారు. హాల్‌టికెట్‌ సంఖ్య, పరీక్షా కేంద్రాలు మారతాయని చెప్పారు. కొత్త హాల్‌ టికెట్లను సెప్టెంబరు 3 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని యాదయ్య తెలిపారు. ఎంసెట్‌-3 నిర్వహణ కమిటీ ఇవాళ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌లో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంసెట్‌-3 విధివిధానాలు, పూర్తి షెడ్యూల్‌ వివరాలతో ఈనెల 8న నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించింది. రెండు మూడు రోజుల్లో ఎంసెట్‌-3 వెబ్‌సైట్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని కన్వీనర్‌ తెలిపారు. బయోమెట్రిక్‌ ఇతర నిబంధనలు గతంలో మాదిరిగానే ఉంటాయని వివరించారు.సమావేశానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఇటీవల ఎంసెట్‌-2 లీకేజీ తరవాత మళ్లీ ఎంసెట్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.