అక్రమంగా తరలిస్తున్న రూ. 8 కోట్లు స్వాధీనం

హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న రూ. 8 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని పాలమాకుల వద్ద అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న రెండు ప్రైవేటు బస్సులను ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఐదుగురు వ్యక్తుల వద్ద రూ. 8 కోట్లు లభ్యమవడంతో ఆ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు తప్పించుకున్నారు. నగదుతో పాటు, రెండు బస్సులను కూడా సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.