80 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం  

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 80 శాతం పూర్తయిందని  డీఆర్డీఏ పీడీ తెలిపారు. ప్రతీ గ్రామంలో పూర్తయిన మరుగుదొడ్ల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.ఆన్‌లైన్‌లో పొందపర్చడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఉపాధి పనుల కల్పన, వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపుల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న విషయాలను గ్రామస్థులను అడిగి తెలుసు కున్నారు. గ్రామాల్లోని కూలీలందరికి ఉపాధి కల్పిస్తామన్నారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది జూన్‌లో ఉపాధిహావిూ పథకం ద్వారా జిల్లాలో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామ స్థాయిల్లో అవసరమయ్యే మొక్కలను గుర్తించి వాటిని సరఫరాచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. నిమ్మ, దానిమ్మ, ఉసిరి, జామ వంటి పండ్ల మొక్కలను కూడా సరఫరాచేసేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు.