భాజపాకు డిపాజిట్ల గల్లంతు
మెదక్ మాదే : ఎంపీ వినోద్
సంగారెడ్డి, సెప్టెంబర్ 9 (జనంసాక్షి) : మెదక్‌లో బిజెపి డిపాజిట్లు గల్లంతవు తాయని కరీంనగర్ టిఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే కుదేలయ్యిం దన్నారు. ప్రజల తీర్పు మరోమారు తెరాసవైపేనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మరోమారు తెలంగాణ విశ్వరూపం చూపించబోతున్నారని అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ రాష్టాభ్రివృద్ధి మున్ముందు ఎలా ఉంటుందో వంద రోజుల పాలనలోనే కేసీఆర్ చూపించారన్నారు. రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దాలనే అంశంలో కేసీఆర్ స్పష్టమైన వైఖరితో ఉన్నారన్నారు. రాష్టాభ్రివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రప్పించుకుంటామన్నారు. లోక్‌సభలో ప్రతి అంశంపైనా తాము చర్చిస్తామని ఎంపీ వినోద్ తెలిపారు. మెదక్ ఉప ఎన్నికలో తెరాసకు భారీ మెజార్టీ ఖాయమని అన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్, భాజపాలు డిపాజిట్లు కాపాడుకునేందుకు తెరాసపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటైన 47రోజుల్లోనే 43అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం తీర్మానాలు చేసిందన్నారు. రైతు రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అఖండ విజయం సాధిస్తారని అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరిపై కేసులు తొలగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టంచేశారు. రైతుల కోసం ఏవిూచేయలేని కాంగ్రెస్, తెదేపా-భాజపాల కుట్రపూరిత మాటలు నమ్మెద్దని కోరారు. పరిశ్రమలకు కోతలు విధించినా రైతులకు విద్యుత్తు కొరత లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. రేషన్ కార్డులు పోతాయి.. రుణమాఫీ జరుగదు.. అంటూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారి మాటలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. కేసీఆర్ ప్రజల సంక్షేమం కోరి ఆదర్శవంతమైన పాలన అందిస్తారని వినోద్ అన్నారు. మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ సీఎం చేయనటువంటి అభివృద్ది కార్యక్రమాలతో ముందుకుపోతున్నారన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ది పనులు చేయని సునీతాలక్ష్మారెడ్డి ఇప్పుడు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వద్దంటూ సోనియాగాంధీకి లేఖ రాసిన జగ్గారెడ్డికి భాజపా టికెట్ ఇవ్వడం వారి తెలివితక్కువతనానికి నిదర్శనమన్నారు. తెదేపా నేతలు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి ఆంధప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తొత్తులుగా మారి విమర్శలు చేయడంసబబు కాదని అన్నారు. తెరాస అభ్యర్థి కొత్తప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.