కాశ్మీర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

5
వరద తగ్గుముఖం

శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి) : జమ్మూకశ్మీర్‌లో వరదల ధాటికి జన జీవనం అతలాకుతలం కాగా మంగళవారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. వరదలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరదల్లో  పలువురు మరణించగా, మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. దాదాపు 200మందికిపైగానే మరణించారని సమచారం. వరదలు ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. 19మంది బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వరద బాధితులను 148 పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ఇప్పటివరకు 11,407 మందిని సురక్షిత ప్రాంతాలను తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌ వరద సహాయక చర్యల్లో పౌర విమానయానశాఖ పాల్గొంటున్నట్లు కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. ఢిల్లీలో ఆయన విూడియాతో మాట్లాడుతూ బాధితులకు అవసరమైన సామాగ్రితో శ్రీనగర్‌కు రెండు ఎయిరిండియా విమానాలు పంపినట్లు వెల్లడించారు. కేవలం వాయు మార్గంలోనే సహాయ చర్యలకు అవకాశముందన్నారు. మందులు, ఆహార పదార్దాలను హెలిక్టాపర్‌ ద్వారా పంపిస్తున్నట్లు చెప్పారు.జమ్ము కాశ్మీర్‌ ప్రాంతంలో ముంచుకొచ్చిన వరదల్లో 60మంది తెలుగు వాళ్లు చిక్కుకున్నారు. తాజాగా శ్రీనగర్లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు చేరుకుంది. అనంతపురం జిల్లా కొత్తచెరువు ప్రాంతానికి చెందిన ముఖేష్‌ అనే ఎన్‌ఐటీ విద్యార్థి ఈ వరద నీటిలో పడి గల్లంతు అయినట్లు తెలిసింది. దాంతో ముఖేష్‌ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన ఎన్‌ఐటీ అధికారులు.. వెంటనే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి ఇలాగే సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఇదిలావుంటే జమ్మూకాశ్మీర్‌లో మరో మూడు రోజుల్లో వానలు తగ్గుముఖం పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీనగర్‌లో వరదనీరు క్రమంగా తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. మరోపక్క దాల్‌ సరస్సు నీటిమట్టం పెరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.కాశ్మీర్‌లోయలో ఇప్పటివరకు 42,500మందిని సహాయ బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. వేలాది వరద బాధితులకు కాశ్మీర్‌ విశ్వవిద్యాలయంలో ఆశ్రయం కల్పించారు. వరదల్లో రక్షించినవారి పేర్లు, వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టమని కేంద్రం జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వానికి కేంద్ర ¬ంశాఖ సూచించింది.