ఉపాధి హామీకి కోత

1

టాయిలెట్లను మందిరాలుగా మార్చారు

గడ్కారీ ఫైర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) :

ఉపాధి హామీ పథకంలో కోతలు విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లోనే పథకం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే గ్రావిూణ ప్రాంతాల్లోని నివాసాల్లో టాయిలెట్లను ప్రార్ధనా మందిరాలుగా, గోడౌన్లుగా మార్చారని కేంద్ర గ్రావిూణ శాఖ నితిన్‌ గడ్కరీ అన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా టాయిలెట్లను వినియోగించలేకపోతున్నారని గడ్కరీ తెలిపారు. తాగునీరు, సానిటేషన్‌ అంశాలపై సోమవారం నిర్వహించిన సమావేశంలో గడ్కరీ పాల్గొన్నారు. గడ్కరీ మాట్లాడుతూ తలసరి ఆదాయం అధికంగా ఉన్నచోట్ల ఉపాధి హామీ పథకం అవసరమేం టని ప్రశ్నించారు. పథకానికి సంబంధించిన నిధులను జలసంరక్షణ పనులకు వినియోగించాలని అన్నారు. మహాత్మగాంధీ 150వ జన్మదినోత్సవం నాటికి అంటే 2019 క్లీన్‌ ఇండియా అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి  ప్రభుత్వం  కేవలం టాయిలెట్లను నిర్మిస్తే సరిపోదని ఆయన అన్నారు. దేశంలో మూడు లక్షల టాయిలెట్లను నిర్మిస్తే అందులో కేవలం 10వేల సంఖ్యలో మాత్రమే ప్రజలు వినియోగిస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో నిర్మించిన టాయిలెట్లను మందిరాలుగా మలచడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. అందుకే నీటి వసతులు లేకుండా టాయిలెట్లను ఉపయోగిస్తే నిరుపయోగమని, ప్రభుత్వం అనుకునే లక్ష్యం నెరవేరదని నితిన్‌ గడ్కరీ అన్నారు.