మెడికల్ సీట్ల పునరుద్ధరణకు ‘సుప్రీం’ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 (జనంసాక్షి) :
వైద్య కళాశాలల్లో సీట్ల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇందుకుగాను పలు షరతులు విధించింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని లిఖితపుర్వక హామీతోపాటు 10 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ కళాశాలల్లో దాదాపు వెయ్యి మెడికల్ సీట్లు పునరుద్ధరించే అవకాశం కలుగుతుంది. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు వాటిని మెరుగుపరచక పోతే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన పది కోట్ల రూపాయలను జప్తు చేస్తామని కోర్టు పేర్కొంది.