గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిద్దాం

4

సమగ్ర సర్వేకు ముఖ్యమంత్రి ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) :

గొలుసుకట్టు చెరువులన్నింటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం నుంచి సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. సాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని పాడుబడిన చెరువులను పునరుద్దరిస్తామని పేర్కొన్నారు. చెరువులలో పేరుకుపోయిన పూడికను తీసి పునరుద్దరిస్తామని తెలిపారు. ఈనెల22న ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చెరువులపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రతిపట్టణం, పతిగ్రామం, ప్రతి వీధికి తాగునీరు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. పాలమూరులో 6.5లక్షల ఎకరాలకు సాగునీరు కల్పిస్తామన్నారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం ఆగాలన్నారు. సెప్టెంబరు 17ను హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్‌, టిడిపిలు అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఇదిలావుంటే  మూడేళ్లలో హరిత తెలంగాణ సాధిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు పూర్తిగా సహకరిస్తామని హావిూయిచ్చారు. మహబూబ్నగర్‌ జిల్లా జిల్లా కొత్తూరు మండలం పెంజెర్లలో పీఅండ్‌జీ పరిశ్రమను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల్లో 70 శాతం మంది తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. పరిశ్రమలకు 24గంటల విద్యుత్‌ అందిస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 35వేల ఎకరాలు పరిశ్రమలకు సిద్దంగా ఉందని తెలిపారు. రూ. 20 వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుచేస్తామన్నారు. పాలమూరు నుంచి వలసలు బంద్‌ కావాలన్న ఆకాంక్షను కేసీఆర్‌ వెలిబుచ్చారు. మరోవైపు ఇరు రాష్టాల్ర ప్రభుత్వ కార్యదర్శులు భేటీ అయ్యారు. ఇవాళ సచివాలయంలోని ఎల్‌ బ్లాకులో రెండు రాష్టాల్రకు చెందిన సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పులిచింతల ప్రాజెక్టు నీటి నిలువపై చర్చించినట్టు సమాచారం.