బలపడిన బంధం

5

12 ఒప్పందాలపై చీన్‌-భారత్‌ సంతకాలు

మానస సరోవరానికి రోడ్డు మార్గం

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) :

భారత్‌-చైనాల బంధం మరింత బలపడు తోంది. ఇరు దేశాలు 12 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భక్తులు మాసన సరోవరానికి వాహనాల్లో చేరుకోవడానికి చక్కటి రోడ్డు మార్గం ఏర్పాటుచేయన్నుట్లు భారత ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌, చైనాలు ముందు వరసలో ఉన్నాయని ఇరు దేశాల మధ్య సంబంధా లను గొప్ప అవకాశంగా మలుచుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయిన అనం తరం ఆయన మీడియాతో మాట్లాడారు. చైనా మనకు అత్యంత సన్నిహితమైన దేశమని ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత పెరుగు పరుచుకోవాల్సిన అవ సరం ఉందని అన్నారు. సాంస్కృతికంగా, సామాజికంగా చైనా ఎంతో అభివృద్ధిని సాధించిందని అన్నారు. రెండు రోజుల పాటు భారత్‌ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడితో ఎన్నో విషయాలు మాట్లాడు కునే అవకాశం కలిగిందని అన్నారు. ఇరు దేశాల మధ్య నిరంతరం శిఖరాగ్ర సమావేశాలు జరుపుకోవడానికి ఈ రెండు రోజుల భేటీ ఎంతో ఉపయుక్త్తమైందని అన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ఐదేళ్లపాటు వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు గొప్ప ముందడుగుగా ప్రధాని అభివర్ణించారు. భారత కంపెనీలకు అమ్మ

కాల, పెట్టుబడులపై మార్కెట్‌ అవకాశాలు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. భారత్‌ మౌలిక సదుపాయాల   రంగంలో చైనాకు అవకాశాల కల్పనపై కూడా చర్చించామని అన్నారు. విద్యుత్‌ ఉత్పాదన, పౌర అణు ఒప్పందంపైన చర్చలు జరపనున్నట్టు చెప్పారు. ఈ ఒప్పందాల వల్ల నేడు పన్నెండు కీలక ఒప్పందాలు కుదిరాయని అన్నారు. ఈ ఒప్పందాల వల్ల వర్షాకాలంలోసైతం భక్తులు మాసన సరోవరానికి వాహనాల్లో చేరుకోవడానికి చక్కటి రోడ్డు మార్గం వేయబోతున్నట్లు ప్రధాని మోడీ వివరించారు. దీనికి సంబంధించి ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయడం జరిగిందని అన్నారు. ఒప్పందాలు జరిగిన వాటిలో ఆర్థిక, వాణిజ్య, దృష్య శ్రవణ మాద్యమం, రైల్వే, సాంస్కృతిక, అంతరిక్ష, పన్నులు, నదుల మీదుగా మానస సరోవరానికి రోడ్డు మార్గం, శాంఘై-ముంబై నగరాల అభివృద్ధి మొదలగునవి ఉన్నాయి. కాగా భారత దేశ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గురువారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. బుధవారం గుజరాత్‌లో ఉన్న ఆయన గురువారం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఢిల్లీలోని పలు రోడ్లలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసిన జిన్‌పింగ్‌ అనంతరం మహాత్ముని సమాధివద్దకు వెళ్లి  నివాళులర్పించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తదనంతరం చైనా ప్రథమ మహిళ పెంగ్‌లియాన్‌ ఢిల్లీలోని ఠాగూర్‌ ఇంటర్‌నేషన్‌ స్కూల్‌ను సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. కాగా హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోడీ, జిన్‌పింగ్‌ సమావేశం సందర్భంగా టిబెట్‌కు చెందిన పలువురు హౌస్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.