వరదల్లో ఊహించని నష్టం
277 మంది మృతి : ఒమర్
శ్రీనగర్, సెప్టెంబర్ 19 (జనంసాక్షి) :
ఇటీవల సంభవించిన వరదలతో ఊహించని నష్టం వాటిల్లిందని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. భ యంకర వరదలతో అతలాకు తలమైన జమ్మూకాశ్మీర్‌లో 277మంది మృత్యువాత పడ్డారని అన్నారు. పది రోజులపాటు రాష్ట్రాన్ని అవలాకుతలం చేసిన వరదల దాటికి జమ్మూలో 210మంది మృత్యువాత పడ్డారని, కాశ్మీర్ ప్రాంతంలో 60మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 1892 తర్వాత ఇంతటి భయంకర వరదలు ఇదే ప్రథమమన్నారు. తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకొనేందుకు విదేశాలు ముందుకొస్తున్న తరుణంలో వరద సహాయక వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయించాలని ఒమర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడారు. ఇటీవలి వరదల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వ, ప్రైవేటు ఆస్తులు, రోడ్లు, భవనాలు, బ్రిడ్జిలు, పంటలు అన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టం ఊహించిన దానికంటే పలురెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నష్టపోయిన రాష్టాన్న్రి ఆదుకొనేందుకు వివిధ దేశాలు సాయం ప్రకటించాయన్నారు. ఈ నేపథ్యంలో.. వరద బాధితులకు అందిం చేందుకు వచ్చే మందులు, ఇతర సహాయక సామగ్రిపై కస్టమ్స్ డ్యూటీ మినహాయించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయక వస్తువులపై పన్ను మినహాయించామన్నారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన కాశ్మీర్‌కు యూఏఈ ఆర్థిక సహాయం ప్రకటించింది. అలాగే, ఆస్టేల్రియా కూడా రూ.15 లక్షల విలువైన సహాయక సామగ్రిని అందించేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది.