గడ్డు పరిస్థితిని గట్టెక్కించేందుకే
రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (జనంసాక్షి) : గడ్డు పరిస్థితి నుంచి రైల్వేను గట్టెక్కించిందుకే రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వాని స్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. రైల్వేలో సురక్షిత ప్రయాణం, ప్రయాణికుల భద్రత, నాణ్యమైన సేవలు.. ఈ మూడు అంశాలకే తమ ప్రాధాన్యమని కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ వెల్లడించారు. ఆర్పీఎఫ్ ఎస్సైల పాసింగ్ రైల్వేలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని చేపడతామని కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ వఅవుట్ పరెడ్‌లో పాల్గొనేందుకు శుక్రవారం హైదరాబాద్ వచ్చిన గౌడ దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, కష్టాల్లో ఉన్న రైల్వేను గట్టెక్కించేందుకే రైల్వేలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించామన్నారు. యూపీఏ నిర్ణయాల వల్లే రైల్వే శాఖకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు. దేశంలోనే దక్షిణమధ్య రైల్వే పనితీరు అత్యద్భుతమని ప్రశంసించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 35 ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఈ రైల్వే పరిధిలో మొత్తం రూ.21 వేల కోట్ల పనులు జరుగుతున్నాయని వివరించారు. 4,325 కిలోవిూటర్ల పొడవైన రైల్వే లైను నిర్మాణం తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. సురక్షిత ప్రయాణం, ప్రయాణికుల భద్రత, నాణ్యమైన సేవలు.. ఈ మూడు అంశాలకే తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. యూపీఏ హయాంలో అవలంభించిన విధానాల వల్లే రైల్వే పనులు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు.
దేశంలో రూ.5లక్షల కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. చాలా పనులు పెండింగ్‌లో ఉండడం వల్లే ఈ బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులు కేటాయించలేదని వివరించారు. పెండింగ్ పనులు పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్టులు చేపడతామన్నారు. నష్టాల్లో ఉన్న రైల్వేను అభివృద్ధి బాట పట్టించేందుకు ఎన్డీయే ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోందన్నారు. రైల్వేల అభివృద్ధి కోసమే ఎఫ్‌డీఐలను ఆహ్వానించామని చెప్పారు. త్వరలోనే రైల్వేలో 17వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయిస్తే కాజిపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక్కడ ఏడాదికి 1200వ్యాగన్లు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. రెండు రాష్టాల్ర రైల్వేపై కమిటీ వేశామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ కమిటీ అక్టోబర్ 14న నివేదిక ఇస్తుందన్నారు. నివేదిక వచ్చిన తర్వాత ఇరరు రాష్టాల్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో చర్చిస్తామని చెప్పారు.
త్వరలోనే రైల్వేలో ఖాళీలు భర్తీ
ుౌలాలీ రైల్వే పోలీసు శిక్షణ కేంద్రాన్ని జాతీయ స్థాయి శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. రైల్వేల్లో మహిళల భద్రతకు పూర్తి ప్రాధా న్యత ఇస్తామని.. రానున్న రోజుల్లో 32 కంపెనీల మహిళా కానిస్టేబుళ్ల నియా మకం చేపట్టనున్నట్లు వివరించారు. శుక్రవారం మౌలాలిలోని ఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన 53వ బ్యాచ్ ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి సదానందగౌడ వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 421 మంది ఎస్సైలుగా శిక్షణ పొందారు. అందులో 42మంది మహిళలు కూడా ఉన్నారు. అనంతరం సదానందగౌడ ప్రసంగిస్తూ.. రైల్వే ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లల భద్రతపై దృష్టి కేంద్రీకరించామన్నారు. 4 వేల మంది మహిళలను నియమించనున్నట్లు తెలిపారు. భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పిస్తామని, సమస్యలను పూర్తిగా తీరుస్తామన్నారు. రైల్వేల్లో ఖాళీగా ఉన్న అన్ని స్థాయిల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే పోలీసులకు ఆయుధాలు సమకూర్చనున్నట్లు తెలిపారు. 53వ బ్యాచ్ అధికారులు మౌలాలిలోని శిక్షణ కేంద్రంతో పాటు లక్నోలని జగ్జీవన్‌రాం ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్, గోరఖ్‌పూర్‌లలో శిక్షణ పొందారు. ఆయా సంస్థలకు రూ.10 లక్షల చొప్పున గ్రాంట్ అందించనున్నట్లు సదా నందగౌడ ప్రకటించారు. మౌలాలి శిక్షణ కేంద్రాన్ని జాతీయ స్థాయి శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రతిపాదనను పరిశీలిస్తున ా్నమన్నారు. రైల్వే భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. ఆర్పీఎఫ్ ఎస్కార్టులు అందరికీ మొబైల్ ఫోన్లు అందిస్తామ న్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతభ కనబరిచిన ఎస్సైలకు మంత్రి చేతుల విూదుగా అవార్డులు ప్రదానం చేశారు. అంతకు ముందు ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కృష్ణాచౌదరి మాట్లాడుతూ.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పని చేసే సిబ్బందికి ఆయుధాలు అందించాలని కోరారు. రైల్వే ఉన్నతాధికారులు జయసింగ్ చౌహన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాస్తవ, ఆర్పీఎఫ్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఎస్సీ పాఱీ తదితరులు పాల్గొన్నారు.