బాబు ఆస్తులు పెరిగాయి

4
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆస్తులు పెరిగాయి. శుక్రవారం ఆయన తన, కుటుంబ ఆస్తులను ప్రకటించారు. నాలుగోసారి తన ఆస్తులను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎథిక్స్‌ కమిటీకి తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. కుటుంబ జీవనానికి ఏదో ఒక ఆధారం ఉండాలని హెరిటేజ్‌ను ప్రారంభించినట్లు బాబు తెలిపారు. గతేడాదితో పోలిస్తే బ్యాంకు బ్యాలెన్స్‌ కొద్దిగా పెరిగిందని చెప్పారు. తన భార్య పేరిట ఉన్న ప్రావిడెంట్‌ ఫండ్‌, బంగారంపెరిగాయని తెలిపారు. నిర్వహణ ¬ల్డింగ్స్‌ ఆస్తులు రూ.90లక్షలు పెరిగాయని వెల్లడించారు. తన పేరిట రూ. రూ.70.69లక్షలు, భార్య భువనేశ్వరి పేరిట రూ. 46.88కోట్లు, కుమారుడు లోకేష్‌ పేరిట రూ.11.04కోట్లు, కోడలు బ్రహ్మణి పేరిట రూ.5.32కోట్లు వ్యక్తిగత ఆస్తులున్నట్లు ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో తన కుటుంబ సభ్యులు ఎవరికి వారే తమ ఆస్తులను ప్రకటిస్తారని తెలిపారు.