లక్నోలో ఘోరం

1

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

ఆరుగురు మృతి

లక్నో, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) :

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. శనివారం బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని మోహన్‌లాల్‌ గంజ్‌ ప్రాంతంలో ఈ కర్మాగారం నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన కర్మాగారాన్ని అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పేలుడు ధాటికి కర్మాగారంలో కొంత భాగం కూలిపోయింది. జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా ప్రదేశాన్ని సవిూక్షించారు. కర్మాగార నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హావిూ ఇచ్చారు. బాధితులను ఆదుకుంటామని స్పష్టంచేశారు.