బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం

2

భారీ వర్షసూచన

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) :

పశ్చిమ మధ్య బంగా ళాఖాతంలో మళ్ళీ అల్ప పీడనం ఏర్పడింది. దీం తో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షసూచన ఉన్నట్లు అధికారులు తె లిపారు. సాయంత్రానికి ఉధృక్తమయ్యే అవకాశాలున్నాయి. దీనికి అనుగుణంగా మరో ఆవర్తనం కూడా ఆవరించడంతో దీని ప్రభావం ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర కోస్తా, రాయలసీమల్లో దీని ప్రభావం  అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్రతీరం వెంట 40 నుండి 50కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. ఉత్తర కోస్తాలో భారీ వర్షం నమోదుకానుంది. చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేటకు వెళ్ళిన వారు వెనక్కి రావాలని సముద్రంలో అలజడి ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ప్రభావం కూడా ఎక్కువగా ఉండవచ్చునని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆవర్తనం స్థిరంగా.. ముందుకు కొనసాగుతోంది. తెలంగాణలో సైతం వర్షప్రభావం ఉండవచ్చునని తెలుస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది క్రమంగా మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబందంగా ఉపరితల ఆవర్తనం సైతం స్థిరంగా కదులుతోంది. వీటి ప్రభావం వల్ల రాగల 24గంటల్లో  తెలంగాణలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉంది.