ఐఎస్‌ఐఎల్‌ మిలిటెంట్లపై ప్రపంచం ఉమ్మడి పోరు : ఒబామా

3

వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) :

ఐఎస్‌ఐఎల్‌ మిలిటెంట్లపై ప్రపంచం  మొత్తం ఉమ్మ డిగా పోరాడు తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలి పారు. సిరియా, ఇరాక్‌ లలో భారీగా భూభాగా లను ఆక్ర మించుకున్న ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌ఐఎల్‌) ఉగ్రవాదులపై పోరులో ప్రపంచం మొత్తం ఐక్యంగా ఉందని అన్నారు.  ‘ఇది అమెరికా ఒంటరి పోరాటం కాదు. సిరియా, ఇరాక్‌లలో మరో భూతల యుద్ధం కోసం అమెరికా సైన్యాన్ని పంపబోను. క్షేత్ర స్థాయిలో మన భాగస్వాములే తమ దేశాల భవిష్యత్‌ను రక్షించుకునేలా తోడ్పాటును అందిస్తాం’ అని ఆయన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. తమ వైమానిక శక్తిని ఉపయోగిస్తామని, తమ భాగస్వాములకు శిక్షణ, ఆయుధాలు, సలహాలు ఇస్తామని చెప్పారు. ఇరాక్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా 170 వైమానిక దాడులను నిర్వహించామని పేర్కొన్నారు. ఐఎస్‌ఐఎల్‌ ఉగ్రవాదులపై చేపట్టిన ఆపరేషన్‌లో సాయపడేందుకు 40కిపైగా దేశాలు ముందుకొచ్చాయి. ఇందులో శిక్షణ, ఆయుధాలు ఇవ్వడానికి, మానవతా సాయం అందించడం, వైమానిక దాడులు చేయడం వంటివి ఉన్నాయి. ఈ పోరుకు ముందుకొచ్చిన దేశాలతో కూడిన సంకీర్ణానికి తాము నాయకత్వం వహిస్తామని ఒబామా చెప్పారు. ఐరాస సర్వప్రతినిధి సభలో ఐఎస్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగడతానని తెలిపారు.