పి.ఏ.పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

పి.ఏ.పల్లి,డిసెంబర్ 02(జనంసాక్షి)

-బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు గణపురం శంకర్
-గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి సర్పంచ్ తో,పాటు వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
కోరారు. సోమవారం పి.ఏ.పల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు గణపురం శంకర్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ళలో కేసీఆర్ చేసిన అభివృధి సంక్షేమ పథకాలే మన పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయి అని ఆయన అన్నారు.రెండేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ చేసిన మోసాలు,బిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లాలి అని ఆయన కోరారు.పార్టీలో చేరిన వారిలో గణపురం వెంకటేశ్వర్లు,రవి, వెంకటరాములు,సాయిలు,దుర్గేష్,నరేష్,వెంకటయ్య, తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అద్యక్షులు యెల్గురి వల్లపు రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ బీసీ విభాగం మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి మహేందర్,తోటకూరి పరమేష్, విష్ణువర్ధన్ రెడ్డి,గోలి గిరి,రమావత్ దామోదర్,కృష్ణా రెడ్డి,లోకేష్,వెంకటయ్య,రవి, చిలుముల్ల అనిల్,నరేష్,ధర్మపురం కోటేష్,ప్రవీణ్,మణిపాల్, సుమన్,వెంకన్న,తదితరులు ఉన్నారు.