అక్రిడేషన్ నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక…
· అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలుగా నిమ్మగడ్డ శ్రీనివాస్, అక్కపెల్లి నరేష్
మంగపేట జూన్ 14(జనంసాక్షి) మండలంలోని కమలాపురంలో సీనియర్ అక్రిడిటేషన్ జర్నలిస్టుల నూతన మండల కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఎర్రం స్వామి అధ్యక్షతన కమలాపురం గ్రామంలో నిర్వహించిన జర్నలిస్టుల ముఖ్య సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. మండలంలోని జర్నలిస్టులందరినీ ఏకం చేస్తూ, సరికొత్త ఆశయాలతో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ సమావేశంలో ఎన్నికైన నూతన కార్యవర్గం మండల జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేందుకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అక్కపెల్లి నరేష్, గౌరవ అధ్యక్షులు ఎర్రం స్వామి, మేడ ఆదినారాయణ ఉపాధ్యక్షులు వడ్లకొండ శ్రీనివాస్, పల్లాపు రమేష్ కోశాధికారి కురిమిళ్ళ శ్యామ్ ప్రచార కార్యదర్శులు మఠం రమేష్, అక్కినపెల్లి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు అక్కపెల్లి రాజేష్, మహమ్మద్ ఇషాక్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ బాధ్యులుగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మగడ్డ శ్రీనివాస్, అక్కపెల్లి నరేష్‌లు సంయుక్తంగా మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డలు ఇతర ముఖ్య సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ అహర్నిశలు కృషి చేస్తుంది అని అలాగే అక్రిడిటేషన్ కలిగి ఉండి, సీనియారిటీ ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రెస్ క్లబ్ సభ్యత్వం కల్పిస్తాం అని జర్నలిస్టుల హక్కుల సాధన కోసం కలిసికట్టుగా పోరాడుతాం అని వారు స్పష్టం చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు సీనియర్ జర్నలిస్టులు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆక్రిటేషన్ జిల్లా కమిటీ మెంబర్ వడ్లకొండ వీరయ్య, కమిటీ సభ్యులు వేమ సురేష్, చింత కుమారస్వామి, ఎండి రఫీ, గాజుల పవన్ కుమార్, శివనేని మహేష్ లు పాల్గొన్నారు.



