పాక్ వెన్నులో వ‌ణుకు పుట్టేలా చ‌ర్య‌లు.. కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్‌

(జనంసాక్షి): ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగా దాయాది పాకిస్థాన్ వెన్నులో వ‌ణుకు పుట్టేలా భార‌త్ చ‌ర్య‌లు ఉంటాయ‌ని కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. ఎంసీహెచ్ఆర్‌డీలో నిర్వ‌హించిన రోజ్‌గార్ మేళాలో ఆయ‌న పాల్గొన్నారు. ఉద్యోగాల‌కు ఎంపికైన వంద మందికి నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు. ఆ త‌ర్వాత మంత్రి మాట్లాడుతూ… ప‌హ‌ల్గామ్ పాశ‌విక దాడి ఉగ్ర‌వాదుల రాక్ష‌స‌త్వానికి ప‌రాకాష్ఠ అని అన్నారు. ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లు పాక్ ర‌క్ష‌ణ‌మంత్రి అంగీక‌రించార‌ని గుర్తుచేశారు. కానీ, తుపాకీ ప‌ట్టినోడు ఆ తుపాకీకే బ‌ల‌వుతాడ‌ని అన్నారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీసుకునే క‌ఠిన నిర్ణ‌యాల‌కు అంద‌రూ అండ‌గా నిలివాల‌ని బండి సంజ‌య్ పిలుపునిచ్చారు.

తాజావార్తలు