జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

 

జడ్చర్ల, ఏప్రిల్ 21 (జనంసాక్షి): కుటుంబ యజమానిని కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ‘జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద రూ. 20 వేల ఆర్థిక సహాయం అందిస్తోందని జడ్చర్ల ఎంపిడిఓ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇప్పటివరకు, 18 నుండి 59 ఏళ్ల లోపు వయస్సు ఉండి అకాల మరణం చెందిన వారి కుటుంబాలు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉన్న వారు తెల్ల రేషన్ కార్డు, మరణ ధృవీకరణ పత్రం, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ మరియు ఐ.కె.పి కార్యాలయం నుండి పొందిన ఎన్.ఓ.సి పత్రాలతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఇతర ప్రభుత్వ భీమా పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు దీనికి అనర్హులని, గ్రామ ప్రజా ప్రతినిధులు అర్హులైన వారికి ఈ సమాచారాన్ని చేరవేయాలని ఎంపిడిఓ కోరారు.