14న అస్మిత ఖేళో ఇండియా బాలికల సైక్లింగ్ పోటీలు
ములుగు,జూన్09(జనం సాక్షి):- ఈ నెల 14న ములుగు జిల్లా కేంద్రం లో అస్మిత ఖేళో ఇండియా మహిళల బాలికల సిటీ సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు.సీనియర్, జూనియర్,సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని అన్నారు.విజేతలకు మెరిట్ సర్టిఫికెట్‌తో పాటు మెడల్స్ అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా ఈ పోటీల్లో పాల్గొన్నవారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సైతం అందిస్తామని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తమ సొంత సైకిల్,ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకోవాలని,ఆసక్తి కలవారు ఈ నెల 12 తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.పూర్తి వివరాలకు సైక్లింగ్ కోచ్ శ్రీరామ్ నంబర్ 8886817492 సంప్రదించాలని కోరారు.



