సర్ ప్రక్రియ పైన అవగాహన సదస్సు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 28: జనం సాక్షి: నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కీలకమని ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేషన్ ఫారము నింపి బి ఎల్ ఓ లకి ఇవ్వాలన్నారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి సర్ పై అవగాహన కలిపించారు.ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, సర్ కో ఆర్డినేటర్ ఆకుల లలిత, నూడా చైర్మన్ కేశ వేణు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శరత్, పార్టీ కోశాధికారి భక్త వత్సలమ్,ఏఐసీసీ అసెంబ్లీ కో ఆర్డినేటర్ ఘన్ రాజ్,కో ఆప్షన్ మెంబెర్ బొబ్బిలి మురళి, కాంగ్రెస్ నాయకులు జావీద్ అక్రం,నరేందర్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు