రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ

ఆయిల్ పామ్ సాగును విస్తరించాలి
జిల్లా వ్యవసాయ అధికారి పీవీ రామన రెడ్డి
భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 5 (జనం సాక్షి): మండలంలోని భీమనపల్లి గ్రామంలో మంగళవారం ఏటీఎంఏ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ నిర్వహించారు. పంట వైవిధ్యీకరణ, ఆయిల్ పామ్ సాగు, ఎరువుల వినియోగం తగ్గింపు, కూరగాయల సాగు విస్తరణ, మట్టి పరీక్షలు, అధిక దిగుబడినిచ్చే పంట రకాల ఎంపిక మార్కెట్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయ అధికారి పీవీ రామన రెడ్డి మాట్లాడుతూ వరి ఏకపంట సాగుకు బదులుగా అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న పామ్ ఆయిల్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏడీఏ ఐజాజ్ అలీ ఖాన్, మండల వ్యవసాయ అధికారి ఏ. శైలజ, ఏఈఓలు సీహెచ్. స్వప్న, టీ. శ్వేత, జె. క్రాంతి, జె. నరేష్, డి. పవిత్రన్, శివ, బలరాజు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.



