బయన్నగూడెంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

*తల్లిపాలే బిడ్డలకు శ్రేయస్కరం

*ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పిల్లలకు అన్నప్రాసన వేడుకలు

పెనుబల్లి, ఆగస్టు 4( జనం సాక్షి ) పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం అని బయన్నగూడెం గ్రామ సర్పంచ్ దొంతు సత్యవతి అన్నారు. పెనుబల్లి మండలం బయన్నగూడెం గ్రామపంచాయతీలో మంగళవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా బిడ్డలకు అన్నప్రాసన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యవతి పాల్గొని పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరమని బిడ్డల తల్లులకు సూచించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ ఏ సిడిపిఓ సునీత పిల్లల తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ పుట్టిన బిడ్డలకు తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డల ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల కూడా ఉంటుందని అంతేకాకుండా బిడ్డలు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తల్లిపాల విశిష్టతను గురించి వివరించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరి, గ్రామ కార్యదర్శి వై వి కృష్ణారెడ్డి, ఎంపీడబ్ల్యూ వెంకటేశ్వరరావు, అంగన్వాడి టీచర్ పి జయలక్ష్మి, టి శ్రావణి, కె పద్మ, అంగన్వాడీ హెల్పర్లు పి భారతి,బి సీత, బిడ్డల తల్లులు, గర్భిణీ తదితరులు పాల్గొన్నారు.