రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
పర్వతగిరి: జున్ 14 : (జనం సాక్షి) రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసినట్లే అని రక్తదాత, హనుమకొండ జిల్లా ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దేవేందర్ తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని రెడ్ క్రాస్ లో రక్తదానం చేసినట్లు దేవేందర్ పేర్కొన్నారు. రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో మరొకరికి జీవం పోసినట్టు అని చెప్పారు. ఇప్పటికీ 11సార్లు రక్తదానం చేసినట్లు చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్తదాత మోటివేటర్ కన్నె రాజు , రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.



