స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో బిఎల్ఓల బాధ్యతలు కీలకం

భూదాన్ పోచంపల్లి, మార్చి 26 (జనం సాక్షి): ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారుల (బిఎల్ఓ) పాత్ర అత్యంత కీలకమని తహసీల్దార్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ డబుల్ ఓటర్లను గుర్తించడం, వలస కార్మికుల ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించడం వంటి బాధ్యతలను కచ్చితంగా నిర్వర్తించాలని అన్నారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు నోటీసులు అందజేయాలని సూచించారు. ప్రాజెక్టును మూడు నెలలలోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఐ గుత్తా వెంకట్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మాధురి, సత్యనారాయణ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ కోటేశ్వర్, రవి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు