BPS ఉప్పునుంతల పాఠశాలలో గ్రంథాలయం ప్రారంభం.

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 22 అక్టోబర్ 2022
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మండల కేంద్రంలో గల బిపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో నూతన గ్రంథాలయాన్ని శనివారం నాడు మూడు గంటలకు ప్రారంభించుకున్నారు గ్రంథాలయం కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించి అందులో  సుమారు 300 పుస్తకాలను అందుబాటులో ఉంచారు ఈ సందర్భంగా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న గాజుల వెంకటేష్ ఇంగ్లీష్ మోరల్ స్టోరీస్ సంబంధించిన పది పుస్తకాలను పాఠశాల గ్రంధాలయానికి అందించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు బాలమని వెంకటేష్ మాట్లాడుతూ మేధావులు అందరూ పుస్తకాలు చదివి అందులో ఉన్న జ్ఞానాన్ని పొంది గొప్ప కార్యక్రమాలు నిర్వహించి సమాజం మార్పుకు శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఒక్క పుస్తకం 100 మంది మిత్రులతో సమానంగా జ్ఞానాన్ని ఇస్తుంది తలదించి తలదించి పుస్తకాన్ని చదివితే అది నిన్ను తల ఎత్తుకునేలా చేస్తుంది అందుకే చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కొమని చెప్పారు. పుస్తకాలు చదవడం వలన మనలో భాష పైన సాహిత్యం పైన పట్టు లభించే భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. భాష నైపుణ్యాలు ఉన్నప్పుడే మిగతా విషయాలు స్పష్టంగా అవగాహన అవుతాయి కాబట్టి జ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
Attachments area