బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్‌

 

 రాష్ట్రంలోని ఆరు జిల్లాల మహిళా సంఘా లు, గిరిజనులకు బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్‌ పడింది. ఈ నెల 6న ఆదిలాబాద్‌, భద్రా ద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, ములుగు జిల్లాల మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర చేనేత సహకార సంఘం నుంచి చీరలను సరఫరా చేసింది. గత ప్రభుత్వ హ యాంలో ఎన్నికల కోడ్‌తో చీరల పంపిణీ ఆగిపోయింది.సంఘం వద్ద మిగిలి ఉన్న బతుకమ్మ చీరలకు అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఫొటోలు ఉండగా వాటి పేరుమార్చి తెలంగాణ ఆడపడుచుల చీరల పంపిణీ పథ కం పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మ ల నాగేశ్వర్‌రావు ఫొటోలతో స్టిక్కర్లు అంటించి ఆయా జిల్లాలకు చేరవేశారు. ఈ నెల 7న మహిళా సంఘాల వీవో గ్రూప్‌లు, గ్రామ పం చాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు, గిరిజన ఆడబిడ్డలకు పం పిణీని ప్రారంభించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన చీరలే ఇప్పుడు ఇచ్చారని, వాటికి వీటికి ఎలాంటి తేడా లేదని, పేరు, ఫొటోలు మార్చి ఇవ్వడం ఏమిటని మహిళలు గుసగుసలాడినట్టు తెలిసింది.పండుగ వేళ అందరికీ ఇవ్వకుండా కొందరికే ఇస్తున్నారని పంపిణీ కేంద్రాల వద్ద బాహాటంగానే వ్యతిరేకత వచ్చినట్టు సమాచారం. కేవలం ఆరు జిల్లాల్లోనే చీరల పంపిణీ చేపట్టగా మిగతా 27 జిల్లాల ఆడబిడ్డలకు ఇవ్వకుంటే వారి నుంచి ఆగ్రహం తప్పదని భావించిన ప్రభుత్వం అప్పటికప్పు డు పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర చేనేత స హకార సంఘం ఎండీ శైలజ రామయ్యర్‌ ఉత్తర్వులు జారీచేసి కలెక్టర్లకు పంపించారు.అప్రమత్తమైన కలెక్టర్లు ఉత్తర్వుల కాపీని పంచాయతీ కార్యదర్శులు, అధికారులకు పంపించి చీరల పంపిణీని నిలిపివేయించారు. బతుకమ్మ పండుగ తర్వాత ఈ నెల 15 నుంచి చీరల పంపిణీని చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి అధికారుల అనాలోచిత నిర్ణయాలతో బతుకమ్మ పండుగకు ఎంపిక చేసిన ఆరు జిల్లాల్లోని మహిళలతోపాటు ఇత ర జిల్లాల్లోని మహిళలకు తీవ్ర నిరాశ ఎదురైందని పలువురు చర్చించుకుంటున్నారు.