రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

ఆర్మూర్,జూలై 23(జనంసాక్షి): ఆర్మూర్ పట్టణంలో ఢిల్లీలో జరిగిన అల్లర్లను నిరసిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బిజెపి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. విలేకరులతో నాయకులు బిజెపి పట్టణ అధ్యక్షులు మందుల బాలు,బిజెపి జిల్లా కార్యదర్శి పోల్కం వేణు,మాజీ కౌన్సిలర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ నీట్ లీకేజీ విషయమై న్యాయం చేయాలంటూ చేపట్టిన ఆందోళనలో విదేశీ శక్తుల కుట్ర ఉందన్నారు.విద్యార్థుల ముసుగులో బంగ్లాదేశీయులు,రోహింగాలు అల్లర్లకు పాల్పడుతున్నారన్నారు.అల్లర్ల వెనకాల కుట్రకోణం దాగి ఉందన్నారు.విద్యార్థులకు సరఫరా చేసిన ఆహార పదార్థాలు వాటర్ బాటిల్ల పైన సైతం విదేశీ మార్క్ ఉందన్నారు.సిజెఐ విదేశాల నుండి వచ్చే నిధులు కాంగ్రెస్ గూటికి మళ్లిస్తూ దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు గురి చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొట్టు రాజు,బిజెపి నాయకులు పాన్ శీను, దొండి ఈశ్వర్,కలిగోట ప్రశాంత్,ఉదయ్ గౌడ్,పెద్దోళ్ల భరత్, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.



