కారు డోర్ లాక్.. ఇద్దరు చిన్నారులు మృతి
చేవెళ్ల (జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరి ఆడక మృతిచెందారు. ఆడుకుంటూ వెళ్ళి డోర్లు క్లోజ్ చేసినట్టు తెలిసింది. ఆ డోర్లు కాస్త లాక్ పడటంతో ఊపిరి ఆడక తన్మయశ్రీ(5), అభినయశ్రీ(4) మృతిచెందారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుడా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు.