కెటిఆర్‌, జగదీశ్‌ రెడ్డిలపై కేసు కొట్టివేత


హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇరువురిపై మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారని తీన్మార్‌ మల్లన్న ఫిర్యాదు మేరకు కేటీ-ఆర్‌, జగదీష్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తమపై నమోదైన కేసును కొట్టేయాలని కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డిహైకోర్టును ఆశ్రయించారు. గత కొన్ని నెలలుగా న్యాయస్థానంలో వాదనలు వినిపించారు ఇరువైపు న్యాయవాదులు. ఇరువైపులా వాదనలు ముగియడంతో గత నెల 11న తీర్పు రిజర్వ్‌ చేసింది హైకోర్టు. ఫేక్‌ వీడియోలపై ఎలాంటి ఆధారాలు లేవని తీన్మార్‌ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు ఇవా(శుక్రవారం) కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డికి భారీ ఉపశమనం లభించింది.