డిప్యూటీ మేయర్ కు సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
హైదరాబాద్, మార్చి 01 (జనంసాక్షి) : గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డినీ రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. నగర అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తున్నందుకు, మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నందుకు శ్రీలత శోభన్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరెన్నో పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.