సాతారం సర్పంచ్నారాయణ (కిషన్) గౌడ్‌పై అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు కోరుతూ ఫిర్యాదు

మల్లాపూర్:(జనంసాక్షి) మా నవ తెలంగాణ దినపత్రికలో “సాతారం సర్కారు బడికి రాజకీయ కుట్ర” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తలో సాతారం గ్రామ సర్పంచ్ నారాయణ కిషన్ గౌడ్పై చేసిన ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని తేలింది. ఈ విషయంపై మల్లాపూర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రుద్ర రామప్రసాద్ ఆధ్వర్యంలో మండలానికి చెందిన పలువురు పాత్రికేయులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, సంబంధిత అధికారులను కలిసి సంఘటనపై వాస్తవాలను పరిశీలించి, వివరాలు సేకరించారు. విచారణలో సంబంధిత వార్తలో పేర్కొన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడైంది.సంబంధిత వార్తను రాసిన వ్యక్తి తాను చేసిన ప్రచారం తప్పని అంగీకరించినట్లు, సర్పంచ్ కిషన్ గౌడ్‌పై చేసిన ఆరోపణలు అసత్యమని, తన వల్ల పొరపాటు జరిగిందని ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సాతారం గ్రామ సర్పంచ్ నారాయణ గౌడ్, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అనిల్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో నిరాధార ఆరోపణలు చేసి, అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని కోరినట్లు తెలిసింది.

తాజావార్తలు