బజార్ హత్నూర్ చందునాయక్ తండా లో కార్డన్ & సెర్చ్ తనిఖీలు…

బజార్హత్నూర్ జులై 22( జనం సాక్షి):- ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని చందునాయక్ తండా (భూతాయ్)ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలనుసరం మంగళవారం రోజున ఉదయం గ్రామంలో బోథ్ సి.ఐ గురుస్వామి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 75 బైక్‌లు, 10 ఆటోలు మొత్తం 85 వాహనాలు సీజ్ చేసి, చాలారోజులుగా పెండింగ్‌లో ఉన్న చలానాలను చెల్లించి, ధృవపత్రాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బోథ్, బజార్ హత్నూర్, గుడిహత్నూర్, నేరడిగొండ, సిరికొండ పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోథ్ సి.ఐ గురుస్వామి మాట్లాడుతూ.. ప్రజల రక్షణ, భద్రతే మా ధ్యేయంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని, పాత నేరస్తులు తమ ప్రవర్తన మార్చుకోవాలని, గొడవలకు దిగేవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.



