గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం రెబ్బెనలో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు.
రెబ్బెన, జూన్14(జనంసాక్షి): కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు, రెబ్బెన మండలంలో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్ శనివారం కిరాణా, పాన్ షాపులను తనిఖీ చేసింది. గంజాయి, మత్తు పదార్థాల వాడకం, అమ్మకాలు చట్టవిరుద్ధమని, అలాంటి పనులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటకృష్ణ హెచ్చరించారు. ఈ తనిఖీలు గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపే దిశగా సాగాయి



