అక్రమ గుడుంబా (ఐడీ లిక్కర్) రవాణా చేస్తున్న నిందితుడిని పట్టుకున్న ఆత్మకూర్ పోలీసులు……

ఆత్మకూర్, జులై 6 (జనం సాక్షి): అక్రమంగా గుడుంబా (ఐడీ లిక్కర్) తయారీ, రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆత్మకూర్ పోలీసులు, గుడుంబా రవాణా చేసి సరఫరా చేస్తున్న ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుడు ఇస్లావత్ సక్రు, తండ్రి సోమ్లా, వయస్సు 62 సంవత్సరాలు, నల్లబెల్లి మండలం, నడిగామ గ్రామానికి చెందినవాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పెంచికల్‌పేట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, నిందితుడు నిషేధిత గుడుంబా (ఐడీ లిక్కర్)ను అక్రమంగా రవాణా చేసి సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనపై ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నెం. 137/2026గా ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 7(ఏ ) రీడ్ విత్ సెక్షన్ 8(ఈ ) కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిందితుడిపై గతంలో కూడా ఇదే తరహా నాలుగు (4) కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.అక్రమ గుడుంబా తయారీ, రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆత్మకూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. సంతోష్ హెచ్చరించారు.



