చినుకు పడితే చీకటే

మసిగుండ్ల పల్లి గ్రామ ప్రజలకు తప్పని తిప్పలు
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఏ ఈ
పనితీరు పై ప్రజల అసంతృప్తి.
మిడ్జీల్.జూలై 21.( జనం సాక్షి ) చినుకు పడితే చీకటే మసి గుండ్లపల్లి ప్రజలకు తప్పని తిప్పలు సమస్యపై ఎన్ని సార్లు సంబంధిత ఏ ఈ కి వివరించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గత మూడు రోజుల క్రితం సర్పంచ్ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగా ఇకపై ఇలాంటి ప్రాబ్లం రాదని హామీ ఇచ్చారు కానీ యధాతతం తధావిధి అన్నట్లుగా ఏఈ పనితీరు ఉన్నది ఏఈ పనితీరుపై వసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలలో మాటలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ సమస్యకు అనేకసార్లు విద్యుత్ సిబ్బందికి అధికారులకు వివరించిన పట్టించుకోవడంలేదని ప్రజలు అంటున్నారు వర్షాకాలం కావడంతో ప్రజలు దోమ కాటుకు గురై రోగాల బారిన పడే అవకాశం ఉందని తక్షణమే సంబంధిత అధికారులు ఏ ఈ నిర్లక్ష్యం పై శాఖపరమైన చర్యలు తీసుకుని మసిగుండ్లపల్లి గ్రామ ప్రజలను రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కరెంటు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. లైన్మెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని అతని నిర్లక్ష్యం వల్లనే కరెంటు సప్లై కావడం లేదు అని చిన్నపిల్లలు దోమ కాటుకు గురై డెంగ్యూ.మలేరియా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉన్నదని లైన్మెన్ విధుల్లో నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ సమస్య పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు అంటున్నారు.

తాజావార్తలు