మస్జిద్‌ల వద్ద ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ మేయర్ ఆదేశం

హైదరాబాద్ (జనంసాక్షి) : రమజాన్ పండుగను దృష్టిలో పెట్టుకొని, తార్నాక డివిజన్‌లోని పలు మస్జిద్‌ల వద్ద తగిన ఏర్పాట్లు చేపట్టాలని తార్నాక డివిజన్ ముస్లిం మైనారిటీస్ కమిటీ వారు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ స్పందిస్తూ.. తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ముస్లిం మైనారిటీల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.