నార్కట్‌పల్లిలో పోలీస్ కుటుంబాల ధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి 12వ బెటాలియన్ ఎదుట పోలీస్ కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. డ్యూటీల విషయంలో కిందిస్థాయి ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.అలాగే పోలీస్ ఉద్యోగుల పని భారాన్ని 8 గంటలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, కర్నాటక తరహాలో ఎన్నికల హామీల్లో రేవంత రెడ్డి చెప్పినట్లుగా తెలంగాణలో ఎకో పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. కాగా, పోలీస్ కుటుంబ సభ్యుల ధర్నాతో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.