తీర్మాన్ పల్లి గ్రామాబివృద్ధి కమిటీ చైర్మన్ గా ధర్పల్లి ప్రభాకర్…

ఇందల్వాయి జూలై 7 జనం సాక్షి ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ధర్పల్లి ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఈ మేరకు మంగళవారం గ్రామస్తుల సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు, తనపై నమ్మకంతో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్గా నియమించినందుకు తీర్మాన్ పల్లి గ్రామస్తులకు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా నూతన చైర్మన్ ధర్పల్లి ప్రభాకర్ వెల్లడించారు, గ్రామస్తుల సహకారంతో తమ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు, మండలంలోని అనేక గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీలు పరుష్టంగా ఉన్నాయని అందుకు అనుగుణంగా తమ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి తల వంతు సహకారం అందిస్తానని నూతన చైర్మన్ ధర్పల్లి ప్రభాకర్ తెలిపారు, మాజీ వి డి సి చైర్మన్ సురేష్ నుంచి మంగళవారం బాధ్యతలను ప్రభాకర్ స్వీకరించారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్, చెక్ పవర్ సాయిలు, డిప్ సాయిరామ్, దేశెట్టి రామ్ రెడ్డి,చెన్న తిరుపతి, జరుగు రాజు, శెట్టి చిన్న గంగారం, ఇమ్మడి సాయిలు, గాండ్ల ప్రదీప్, అన్నారం భాస్కర్, బొడ్డు రాజన్న, అబ్బయ్య, తో పాటు గ్రామస్తులు, చెన్న రమేష్,శెట్టి ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు