పుట్టినరోజు సందర్భంగా “మా అభాగ్యుల” వృద్ధాశ్రమంలో దుప్పట్లు, పండ్ల పంపిణీ…

గంభీరావుపేట జూలై 08(జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లోని “మా అభాగ్యుల “వృద్ధాశ్రమంలో చికోడు గ్రామానికి చెందిన కరెడ్ల తిరుపతి తిరుమల కుమారుడు, నవీన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఓ దాతృత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ “మా అభాగ్యుల” వృద్ధాశ్రమంలోని వృద్ధులకు 40,000 విలువ గల దుప్పట్లు, టవాలా,ప్లేటు గ్లాసు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధుల ఆశీర్వాదాలు తీసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మా అభాగ్యుల నిర్వాహకులు మల్లు గారి నర్సాగౌడ్ నిర్వాహకులు మాట్లాడుతూ, పుట్టినరోజులను ఆడంబరంగా జరుపుకోవడం కంటే సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ, చికోడు గ్రామ సర్పంచ్ భూమఆంజనేయులు, మాజీ ఉపసర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపిటిసి లక్ష్మణ్, వార్డ్ మెంబర్ పెద్ద వెన్నక్కన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

తాజావార్తలు