చెట్లను నరకొద్దు పచ్చదనాన్ని పెంచండి అడవి శాఖ అధికారి రహిమోన్ బట్

ఇందల్వాయి ( జనం సాక్షి ) జూన్. 12 ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పరివర్ణాన్ని కాపాడుకుందాం. క్లీన్ అండ్ గ్రీన్ అనే నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు మొక్కలను నాటి పరివరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. చెట్లు ప్రకృతి అమూల్యమైన సంపద అని వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నరకవద్దని ప్రజలకు సూచించారు పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చునని రవి మోహన్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేంజ్ సెక్షన్ ఆఫీసర్ భాస్కర్. ప్రభాకర్ మానస. బీట్ ఆఫీసర్లు రాకేష్ నవీన్. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని మొక్కలు నాటి పరివరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు.