అర్థరాత్రి సాధారణ ప్రసవం నిర్వహించిన నేరేడుచర్ల పీహెచ్‌సీ వైద్యులు తల్లీ బిడ్డ క్షేమం.

నేరేడుచర్ల, జూలై 8 (జనంసాక్షి) : 24 గంటల వైద్య సేవలతో నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది మరోసారి తమ బాధ్యతను నిరూపించుకున్నారు. బుధవారం అర్థరాత్రి పాలకవీడు మండలం శూన్యం పహాడ్ గ్రామానికి చెందిన సుజాత భర్త సైదా నాయక్‌తో కలిసి పురిటి నొప్పులతో రాత్రి 1 గంటకు పీహెచ్‌సీకి చేరుకుంది. ఇది ఆమె రెండో కాన్పు.విధుల్లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ ఉదయశ్రీ వెంటనే విషయాన్ని వైద్యాధికారి డా. పున్న నాగినికి తెలియజేశారు.సమాచారం అందిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్న డాక్టర్ నాగిని గర్భిణికి అవసరమైన పరీక్షలు చేసి, రాత్రి 1:55 గంటలకు విజయవంతంగా సాధారణ ప్రసవం చేయించారు. సుజాత 3.5 కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చింది.ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యాధికారి తెలిపారు.అర్థరాత్రి వేళలోనూ అప్రమత్తంగా స్పందించి ప్రసవం నిర్వహించిన డా. పున్న నాగిని, నర్సింగ్ ఆఫీసర్ ఉదయశ్రీ మరియు సిబ్బంది సేవలను కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.నేరేడుచర్ల పీహెచ్‌సీలో 24 గంటల పాటు నాణ్యమైన మాతా-శిశు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని సిబ్బంది తెలిపారు.



