తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివి

 

 

 

 

 

కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

చేర్యాల(జనంసాక్షి) ఏప్రిల్ 03 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, తెలంగాణ తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య సేవలు మారువలేనివని కురుమ సంఘం నాయకులు అన్నారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య 99వ జయంతిని పురస్కరించుకుని అంగడి బజారులో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నాడు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య ముందుండి నడిచారని, నిజాం రజాకార్ల ఆగడాలు, అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడి రజాకార్ల తుపాకీ తూటాలకు నేలకొరిగిన గొప్ప వీరుడు, తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని వారి సేవలను కొనియాడారు. దొడ్డి కొమురయ్య సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని, ట్యాంక్ బండుపై వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సుందరీకరణ చేయాలని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నేడు రవీంద్ర భారతిలో అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని ఉన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర నాయకులు అందె నాని బాబు, మీస సత్యనారాయణ,అందె బీరయ్య, అందె అశోక్, రాంపూర్ సర్పంచ్ శెట్టె కొమురయ్య, కామల్ల అనిల్ కుమార్, మీస పార్వతి, ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, మీస పార్వతి, గౌండ్ల శ్రీనివాస్, సూర్ణ శ్రీకాంత్, నంగి కనకయ్య,శెట్టె కర్ణాకర్, నంగి చంద్రం, నియోజకవర్గ పునరుద్ధరణ కమిటీ కన్వీనర్ కాటం సంజీవయ్య, పుర్మ ఆగంరెడ్డి, ఆడెపు చంద్రయ్య, భూమిగారి మనోహర్, బుట్టి భిక్షపతి, పోలోజు వెంకటాద్రి, పచ్చిమడ్ల వెంకటయ్య, మిట్టపల్లి నర్సిరెడ్డి,గోమారపు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.