సీత్యా తండాలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రాత్రి బస

ప్రగతి సింగిడి – జనంతో మాట పల్లె బాట లో భాగంగా పర్యటన

స్థానికులతో ముఖాముఖి సమస్యల గుర్తింపు

నేడు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం

మాడ్గులపల్లి, జూన్ 14 (జనం సాక్షి): ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారమే ధ్యేయంగా సాగుతున్న ప్రగతి సింగిడి – జనంతో మాట పల్లె బాట కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శనివారం రాత్రి మాడుగుల పల్లి మండలం సీత్యా తండా గ్రామపంచాయతీలో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా తండాకు చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు తండాలో నెలకొన్న తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు

పాఠశాలలో రాత్రి బస సమస్యల పరిశీలన అనంతరం, ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శనివారం రాత్రి స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే గ్రామస్థులతో కలిసి బస చేశారు ఒక శాసనసభ్యుడు తమతో పాటు రాత్రి వేళ పాఠశాలలో బస చేయడం పట్ల తండా వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

నేడు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం పల్లె బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు అనంతరం లబ్ధిదారులు, స్థానిక ప్రజలతో కలిసి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, వివిధ విభాగాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

తాజావార్తలు